Sai Pallavi: సాయిపల్లవి ఇంట మోగిన పెళ్లి బాజాలు... ఫొటోలు ఇవిగో!
- అట్టహాసంగా సాయిపల్లవి సోదరి పూజా కన్నన్ వివాహం
- కోటగిరిలో పడుకర్ కుల పద్ధతిలో పూజా కన్నన్ వివాహం
- ‘చితిరై సెవ్వానం’ చిత్రంలో నటించిన పూజ
నటి సాయిపల్లవి ఇంట శుభకార్యం జరిగింది. ఆమె సోదరి, నటి పూజా కన్నన్ వివాహం నిన్న ఘనంగా జరిగింది. పూజా కన్నన్ తన సన్నిహిత మిత్రుడు వినీత్తో ఏడడుగులు వేసింది. కోటగిరిలో పడుకర్ కుల పద్దతిలో పూజా కన్నన్ వివాహం అట్టహాసంగా జరిగింది. సాయిపల్లవి దగ్గర ఉండి తన చెల్లెలి వివాహాన్ని జరిపించింది. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వీటిని చూసిన పలువురు నెటిజన్ లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
కాగా, పూజ కన్నన్ కూడా ఒక సినిమాలో హీరోయిన్ నటించింది. ఎఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ‘చితిరై సెవ్వానం’ చిత్రంతో నటిగా పూజ ఎంట్రీ ఇచ్చారు. 2021లో ఇది విడుదలైంది. అయితే తన అక్క స్థాయికి తగ్గట్టుగా క్రేజ్ రాకపోవడంతో సినిమాల నుండి పూజ తప్పుకుంది. వినీత్తో పూజ ఎంతో కాలం నుంచి ప్రేమలో ఉంది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఈ ఏడాది జనవరిలో వీరికి నిశ్చితార్థం జరిగింది.