iPhones: సెప్టెంబర్ 9 తర్వాత ఈ ఐఫోన్ల విక్రయాల నిలిపివేత!

Why iPhone users should be cautious amid News iPhone 16 series Launch


గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ సెప్టెంబర్ 9న కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లో ఆవిష్కరించబోతోంది. ఈ సందర్భంగా పాత మోడల్‌ ఐఫోన్లు ఉపయోగిస్తున్నవారు కాస్త అవగాహనతో ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యాపిల్ గత ట్రెండ్‌ను గమనిస్తే కొత్త ఫోన్లు మార్కెట్‌లో విడుదలైనప్పుడల్లా కొన్ని పాత ఐఫోన్ వేరియంట్‌ విక్రయాలను నిలిపివేసే సంప్రదాయాన్ని కంపెనీ కొనసాగిస్తోంది. కాబట్టి ఇప్పటికే పాత ఫోన్లు వాడుతున్న యూజర్లు కాస్త అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. నిలిపివేసిన ఫోన్లకు సంబంధించి కంపెనీ ఎలాంటి సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ అప్‌డేట్‌లు అందించదు. దీంతో ప్రైవసీ, డేటా విషయంలో యూజర్లు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 3-4 సంవత్సరాలుగా పాత ఐఫోన్లు ఉపయోగిస్తున్నవారు నిలిపివేయనున్న పాత ఫోన్ల అప్‌డేట్‌లను గమనిస్తూ ఉండడం మంచిది.

ఈ ఐఫోన్లు నిలిపివేసే అవకాశం..
కొత్త మోడల్ ఫోన్లు మార్కెట్‌లో విడుదలైన తర్వాత విక్రయాలు నిలిపివేయవచ్చని భావిస్తున్న పాత వెర్షన్‌ ఫోన్ల జాబితాలో ఐఫోన్ 13 సిరీస్, ఐఫోన్ 14 సిరీస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ ఎస్ఈ ఫోన్లు ఉండే అవకాశం ఉంది. అంతేకాదు సెప్టెంబర్ 9 ఈవెంట్ తర్వాత కొన్ని యాపిల్ ఎయిర్‌పాడ్స్, యాపిల్ వాచీలు కూడా నిలిపివేయవచ్చంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి.

మరో పక్క డిస్కౌంట్లు..
మరోవైపు కొత్త ఐఫోన్‌లు మార్కెట్‌లో విడుదలయ్యాక పాత మోడల్ ఫోన్లపై డిస్కౌంట్ కూడా అందించే అవకాశం ఉంటుంది. తక్కువ ధరకు ఐఫోన్ కొనాలనుకునేవారు కూడా ఈ సమయంలో అలర్ట్‌గా ఉండొచ్చు. గతంలో కొత్త ఐఫోన్లు విడుదల చేసిన ప్రతి సందర్భంలోనూ పాత ఫోన్లపై యాపిల్ కంపెనీ డిస్కౌంట్లు అందించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఐఫోన్ 14 వేరియంట్‌ ఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్లు లభించే అవకాశం ఉంది.

కొత్తగా విడుదల కాబోయే ఫోన్లు ఇవే..
ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు సెప్టెంబర్ 9న విడుదల కానున్నాయి. ఈ సిరీస్‌లో నాలుగు కొత్త ఫోన్లు ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయి. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లు కంపెనీ విడుదల చేయనున్న టెక్ కథనాలు పేర్కొంటున్నాయి.

  • Loading...

More Telugu News