Rajtharun Lavanya Case: హీరో రాజ్‌త‌రుణ్, లావ‌ణ్య కేసులో కొత్త ట్విస్ట్‌

Police Charge Sheet Filed in Rajtharun Lavanya Case
  • హీరో రాజ్‌త‌రుణ్, లావ‌ణ్య కేసులో చార్జ్‌షీట్ ఫైల్ 
  • ఇందులో అత‌డిని నిందితుడిగా చేర్చిన‌ పోలీసులు
  • లావ‌ణ్య‌తో రాజ్ త‌రుణ్ ప‌దేళ్ల స‌హజీవ‌నం 
  • వాళ్లిద్ద‌రూ ఒకే ఇంట్లో ఉన్న‌ట్లు నిర్ధారించిన పోలీసులు
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ త‌రుణ్‌, లావ‌ణ్య వ్య‌వ‌హారంలో తాజాగా పోలీసులు మ‌రో ట్విస్ట్ ఇచ్చారు. చార్జ్‌షీట్ ఫైల్ చేసిన పోలీసులు ఇందులో అత‌డిని నిందితుడిగా చేర్చారు. 

లావ‌ణ్య ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఆమెతో రాజ్ త‌రుణ్‌ ప‌దేళ్లు స‌హ‌జీవ‌నం చేయ‌డం నిజ‌మేన‌ని తేల్చారు. వాళ్లిద్ద‌రూ ఒకే ఇంట్లో ఉన్న‌ట్లు త‌మ‌ ప్రాథ‌మిక విచార‌ణ‌లో నిర్ధార‌ణ అయింద‌ని పోలీసులు తెలిపారు.   

అలాగే లావ‌ణ్య చెప్పిన దాంట్లో వాస్త‌వాలు ఉన్నాయ‌న్నారు. లావ‌ణ్య ఇంటి వ‌ద్ద పోలీసులు కీల‌క సాక్ష్యాలు సేక‌రించారు. కాగా, ఇప్ప‌టికే ఈ కేసులో రాజ్ త‌రుణ్ ముంద‌స్తు బెయిల్ తీసుకున్నారు.
Rajtharun Lavanya Case
Police Charge Sheet
Tollywood

More Telugu News