Vijayawada Floods: విజయవాడలో నిత్యావసర వస్తువుల పంపిణీ ప్రారంభించిన మంత్రులు
- వరద బీభత్సం నుంచి తేరుకుంటున్న విజయవాడ నగరం
- నిత్యావసర సరుకుల పంపిణీ షురూ చేసిన మంత్రులు అచ్చెన్న, నాదెండ్ల, కందుల
- ప్రతి ఇంటికీ సరుకులు 100 శాతం పంపిణీ అయ్యేలా ఆదేశాలు
భారీ వరదతో విలవిల్లాడిన విజయవాడ నగరం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. ముంపు ప్రాంతాల్లో పరిస్థితులు క్రమంగా మెరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలో, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ విజయవాడలో నిత్యావసర వస్తువుల పంపిణీ వాహనాలను ప్రారంభించారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు నుంచి నిత్యావసర సరుకుల పంపిణీ షురూ చేశారు.
ప్రతి ఇంటికి నిత్యావసర సరుకుల పంపిణీ 100 శాతం జరిగేలా మంత్రులు ఆదేశించారు. వరద బాధితులకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పంచదార, 2 కిలోల ఉల్లిగడ్డలు, 2 కిలోల బంగాళాదుంపలు, లీటర్ పామాయిల్ పంపిణీ చేస్తున్నారు.