Hyundai Motor India: ఆకట్టుకుంటున్న హ్యుండాయ్ క్రెటా కొత్త వెర్షన్!

hyundai motor india has officially launched the creta night edition in the domestic market
  • క్రెటా నైట్ కొత్త ఎస్‌యూవీని మార్కెట్ లోకి విడుదల  
  • కొనుగోలు దారులను విశేషంగా ఆకట్టుకుంటున్న క్రెటా నైట్ ఎస్‌యూవీ
  • పెట్రోల్, డీజిల్ ఆప్షన్‌లతో పరిచయం చేసిన హ్యూండాయ్ మోటార్ ఇండియా 
హ్యూండాయ్ మోటారు ఇండియా తాజాగా కొత్త వెర్షన్ ‘క్రెటా  నైట్’ ఎస్‌యూవీని దేశీయ మార్కెట్‌‌లో విక్రయానికి విడుదల చేసింది. ఆకర్షణీయమైన బ్లాక్ పెయింట్ స్కీమ్, ఆధునిక ఫీచర్లతో కూడిన ఈ ఎస్‌యూవీని .. పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో పరిచయం చేసింది. హ్యూందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.14.51 లక్షలుగా నిర్ణయించింది. దాని టాప్ – స్పెక్ వేరియంట్ ధర రూ.20.15 లక్షల (ఎక్స్ షోరూమ్) వద్ద అందుబాటులో ఉంటుంది. సాధారణ క్రెటాకు పూర్తి భిన్నంగా 21 ప్రధాన మార్పులతో కంపెనీ దీన్ని (క్రెటా నైట్)  మార్కెట్ లోకి తీసుకువచ్చింది.

ఎక్స్‌టీరియల్ నుండి ఇంటీరియర్ వరకూ ఇందులో మార్పులు చేశారు.  బ్లాక్ కలర్ ఎక్స్‌టీరియర్, కాంట్రాస్ట్ రెడ్ బ్రేక్ కాలిపర్‌లతో బ్లాక్ అల్లాయ్ వీల్స్, మ్యాటీ లోగో, బ్లాక్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్, బ్లాక్ స్పాయిలర్ వంటివి క్రెటా నైట్ ఎడిషన్ అప్ డేట్ లలో ప్రధానంగా ఉన్నాయి.  సాధారణ కలర్ ఆప్షన్స్ మాత్రమే కాకుండా, కొనుగోలుదారులు రూ.5వేలు అదనంగా చెల్లించి టైటాన్ గ్రే మ్యాటీ కలర్ వాహనాన్ని, రూ.15వేలు చెల్లించి డ్యూయల్ టోన్ కలర్స్ ను ఎంచుకునే అవకాశాన్ని కూడా కంపెనీ కల్పించింది.
Hyundai Motor India
creta night
SUV

More Telugu News