vinayakan: పోలీసుల అదుపులో 'జైలర్' మూవీ విలన్!
- శంషాబాద్ ఎయిర్ పోర్టులో మలయాళ నటుడు వినాయకన్‌ను అదుపులోకి తీసుకున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది
- ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌ను వినాయకన్ మద్యం మత్తులో కొట్టారన్న అభియోగంపై కేసు
- వినాయకన్ ను ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించిన సీఐఎస్ఎఫ్
జైలర్ సినిమాలో విలన్‌గా నటించిన మలయాళ నటుడు వినాయకన్‌ను శంషాబాద్ ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ను వినాయకన్ కొట్టినట్లు తెలుస్తొంది. మద్యం మత్తులో ఉన్న వినాయకన్ కానిస్టేబుల్ పై దాడి చేసినట్లు ఫిర్యాదు అందింది. దీంతో వినాయక్‌ను ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది.. అతన్ని ఆర్జీఐ పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది
కాగా, ఎక్కువగా మలయాళ సినిమాల్లో నటించిన వినాయకన్ .. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ మూవీలో వర్మ పాత్రతో పాప్యులర్ అయ్యాడు. ప్రస్తుతం గోవాలో సెటిల్ అయిన వినాయకన్ .. కొచ్చిన్ లో సినిమా షూటింగ్ ముగించుకుని గోవా కనెక్టింగ్ ఫ్లైట్ కోసం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పెయింటింగ్ లో ఉన్న సమయంలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు చెబుతున్నారు.