YS Jagan: జగన్ పాస్పోర్ట్ కేసులో తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
- ఎల్లుండి తీర్పును వెలువరించనున్న ఏపీ హైకోర్టు
- జనరల్ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న జగన్
- ఇరువైపుల సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పాస్పోర్ట్ కేసులో తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈ అంశంలో ఎల్లుండి తీర్పును వెలువరించనుంది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
సార్వత్రిక ఎన్నికల్లో జగన్ అధికారం కోల్పోవడంతో ఆయన డిప్లొమేటిక్ పాస్పోర్ట్ రద్దయింది. దీంతో ఆయన జనరల్ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కోర్టు నుంచి ఎన్వోసీ కావాలని పాస్పోర్ట్ కార్యాలయం అడిగింది. దీంతో జగన్ విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఏడాదికి పాస్పోర్ట్ ఇవ్వాలని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే తనకు అయిదేళ్లకు పాస్పోర్ట్ కావాలంటూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం సుదీర్ఘ వాదనలు విన్నది. అనంతరం తీర్పును వాయిదా వేసింది.