Anil Arora Suicide: బాలీవుడ్ స్టార్ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య

Bollywood Actress Malaika Arora Father Anil Arora Committed Suicide
బాలీవుడ్ స్టార్ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా కొద్దిసేపటి క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని తన నివాసం టెర్రస్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే బాంద్రా పోలీసులు, క్రైం బ్రాంచ్ బృందం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా ప్రదేశంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. 

అయితే, గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిసింది. ఘటన జరిగిన సమయంలో మలైకా అరోరా ఇంట్లో లేరు. ప్రస్తుతం పూణెలో ఉన్న ఆమె సమాచారం అందుకున్న వెంటనే ముంబైకి బయలుదేరారు. అనిల్ అరోరా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Anil Arora Suicide
Malaika Arora
Bollywood
Mumbai

More Telugu News