India vs Bangladesh: భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు జట్టుని ప్రకటించిన బంగ్లాదేశ్... కీలక ఆటగాడు దూరం
సెప్టెంబరు 19 నుంచి భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్ కోసం బంగ్లాదేశ్ సెలక్టర్లు జట్టుని ప్రకటించారు. ఇటీవల పాకిస్థాన్ జట్టును చారిత్రాత్మక రీతిలో వారి సొంతగడ్డపైనే 2-0 తేడాతో ఓడించిన బంగ్లాదేశ్ జట్టులో ఒకే ఒక్క మార్పు చేసి 16 మంది సభ్యుల టీమ్‌ను వెల్లడించారు.
బంగ్లా జట్టు ఇదే...
నజ్ముల్ హొస్సేన్ శాంటో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మిగతా ఆటగాళ్లలో షద్మాన్ ఇస్లాం, జాకీర్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహిద్ రానా, తైజుల్ ఇస్లాం, మహ్మదుల్ హసన్ జాయ్, నయీమ్ హసన్, ఖలీద్ అహ్మద్ ఉన్నారు.

పాకిస్థాన్‌పై చారిత్రాత్మకమైన విజయం సాధించిన బంగ్లాదేశ్ జట్టులో భాగంగా ఉన్న లెఫ్ట్ ఆర్మ్ పేసర్ షోరిఫుల్ ఇస్లామ్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ ఆటగాడు జాకర్ అలీని సెలక్టర్లు ఎంపిక చేశారు. అతడు బంగ్లా జాతీయ జట్టుకు ఎంపికవడం ఇదే తొలిసారి.
పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో షోరీఫుల్ గాయానికి గురయ్యాడు. అతడు ఇంకా కోలుకోకపోవడంతో ఆశ్చర్యకరంగా యంగ్ క్రికెటర్‌ను జట్టులోకి తీసుకున్నారు. జాకర్ అలీ ఇటీవల పాకిస్థాన్-ఏ టీమ్‌పై బంగ్లాదేశ్-ఏ తరపున సెంచరీ బాదాడు.
ఇక బంగ్లాదేశ్ తరపున అతడు ఇప్పటివరకు 17 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అతడు ఇప్పటివరకు 49 మ్యాచ్‌లు ఆడాడు. 41.47 సగటుతో మొత్తం 2,862 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి.