Venu Swamy: వేణు స్వామికి షాకిచ్చిన నాంపల్లి కోర్టు

Nampally Court orders to file case against Venu Swamy
  • వేణు స్వామి ప్రజలను మోసం చేస్తున్నారంటూ 'టీవీ5' మూర్తి పిటిషన్
  • మోసాలను వెలుగులోకి తెచ్చిన తనపై కుట్ర పన్నారన్న మూర్తి
  • వేణు స్వామిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం
జ్యోతిష్యుడు వేణు స్వామికి హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు షాకిచ్చింది. ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. జాతకాల పేరుతో ప్రజలను వేణు స్వామి మోసం చేస్తున్నారని... ప్రధాని మోదీ ఫొటోను కూడా మార్ఫింగ్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కోర్టులో ప్రముఖ పాత్రికేయుడు 'టీవీ5' మూర్తి పిటిషన్ వేశారు. 

వేణు స్వామి మోసాలను వెలుగులోకి తీసుకొచ్చిన తనపై కుట్ర పన్నారని పిటిషన్ లో మూర్తి పేర్కొన్నారు. పిటిషన్ ను విచారించిన కోర్టు పిటిషనర్ వాదనలతో ఏకీభవించింది. వేణు స్వామిపై కేసు నమోదు చేసి, విచారణ జరిపాలని జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించింది.
Venu Swamy
Case

More Telugu News