Revanth Reddy: ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ సమావేశం
- సాయంత్రం నాలుగు గంటలకు కేబినెట్ సమావేశం
- సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న కేబినెట్ భేటీ
- మంత్రివర్గ సమావేశంలో వివిధ అంశాలపై చర్చ
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 20న సమావేశం కానుంది. సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.