Devineni Uma: ఏలేరు, బుడమేరు ముంపు పాపం జగన్ దేనని తేలిపోయింది: దేవినేని ఉమా

Devineni Uma reacts on Jagan explanation over Yeleru project
  • నిన్న పిఠాపురం నియోజకవర్గంలో జగన్ పర్యటన
  • ఏలేరు ప్రాజెక్టు గురించి ప్రశ్నించిన మీడియా
  • జగన్ వివరణపై విమర్శలు గుప్పించిన దేవినేని ఉమా
  • ఏలేరు పనులు చేయలేదని జగన్ ఒప్పుకున్నాడని వెల్లడి
నిన్న పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన జగన్ ను మీడియా ఏలేరు ప్రాజెక్టు గురించి ప్రశ్నించింది. కాలువల అభివృద్ధి పనులు చేపట్టాలంటే క్రాప్ హాలిడే ప్రకటించాల్సి ఉంటుందని, పైగా ప్రాజెక్టులో నీరు పూర్తిస్థాయిలో ఉండడంతో రైతులు పంటలు పండించుకుంటారులే అనే ఉద్దేశంతో తాము క్రాప్ హాలిడే ప్రకటించలేదని జగన్ వివరణ ఇచ్చారు. అందువల్లే తమ హయాంలో ఏలేరు పనులు చేపట్టలేకపోయామని చెప్పారు.

దీనిపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. ఏలేరు, బుడమేరు పాపం జగన్ దేనని తేలిపోయిందని విమర్శించారు. చంద్రబాబు మొదలుపెట్టిన ఏలేరు ఆధునికీకరణ పనులు ఐదేళ్లలో తాము చేయలేదంటూ జగన్ ఒప్పుకున్నారని వెల్లడించారు. పురుషోత్తపట్నం లిఫ్ట్, బుడమేరు ఆధునికీకరణ పనులు సైతం ఆపేశారని ఉమా ఆరోపించారు. 

చేసిన పాపం కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు చెప్పడం, ఫేక్ ప్రచారాలు చేయడంలో జగన్ రెడ్డి గోబెల్స్ ను మించిపోయాడని విమర్శించారు. 

అన్నమయ్య ప్రాజెక్టు బాధితులను ఐదేళ్లు పట్టించుకోలేదని, చంద్రబాబు బాధితులకు అండగా ఉండడంతో జగన్ ఆందోళన చెందుతున్నాడని ఉమా ట్వీట్ చేశారు.
Devineni Uma
Jagan
Yeleru project
Pithapuram
TDP
YSRCP

More Telugu News