Bill Gates: ఇంత డబ్బు సంపాదిస్తానని అప్పుడు అనుకోలేదు: బిల్ గేట్స్

bill gates says what is the secret of success of his company microsoft
  • కలలను నెరవేర్చుకోవడానికి కళాశాల విద్యను మధ్యలోనే ఆపేసినట్లు చెప్పిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు
  • డబ్బు, కీర్తి కంటే గొప్ప ఉత్పత్తిని సృష్టించడంపై తన దృష్టి ఉండేదన్న బిల్ గేట్స్ 
  • హార్వర్డ్ యూనివర్శిటీని వీడినప్పుడు బిలియనీర్ అవుతానని ఊహించలేదన్న సంపన్నుడు
ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన కంపెనీ విజయ రహస్యం ఏమిటో వెల్లడించారు. సీఎన్‌బీసీ 'మేక్ ఇన్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ తన కెరీర్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

తన కలలను నెరవేర్చుకోవడానికి కళాశాల విద్యను మధ్యలోనే ఆపేసినట్లు బిల్ గేట్స్ తెలిపారు. ప్రతి ఇంట్లో డెస్క్‌పై పర్సనల్ కంప్యూటర్ ఉండాలన్న దృక్పథంతోనే మైక్రోసాఫ్ట్ ను ప్రారంభించి విజయం సాధించినట్టు ఆయన తెలిపారు. హార్వర్డ్ యూనివర్శిటీని వీడినప్పుడు బిలియనీర్ అవుతానని ఊహించలేదని ఆయన చెప్పారు. డబ్బు, కీర్తి కంటే గొప్ప ఉత్పత్తిని సృష్టించడంపై తన దృష్టి ఉండేదన్నారు. సాఫ్ట్ వేర్‌పై నిబద్ధత, కంప్యూటింగ్ లు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే బిల్ గేట్స్ ఆలోచన నేడు దాదాపు ఫలించింది. 

కాగా తమ లక్ష్యాలను సాధించేందుకు కాలేజీ మధ్యలోనే చదువు ఆపేసి విజయవంతమైన వ్యాపారవేత్తల్లో బిల్ గేట్స్ ఒకరిగా ఉన్నారు. ఈ జాబితాలో గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ అధినేత స్టీవ్ జాబ్స్, మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు. వీరంతా సాఫ్ట్‌వేర్ రంగంలో నిబద్ధతతో పనిచేశారు. కంప్యూటింగ్ అందరికీ అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. ఈ దిశగా చాలా వరకు సక్సెస్ అయ్యారని చెప్పాలి.
 
బిల్ గేట్స్ తన స్నేహితుడు పాల్ అలెన్ తో కలసి 1970లో కంప్యూటర్ లను యూజర్ ఫ్రెండ్లీగా, సామాన్యులకు అందుబాటులో తీసుకొచ్చేందుకు కృషి చేశారు. గేట్స్, అలెన్ తరచూ దీనిపై పని చేశారు. మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం మార్కెట్ క్యాప్ దాదాపు మూడు ట్రిలియన్ డాలర్లు.
Bill Gates
Microsoft company

More Telugu News