china: చైనాలో బెబింకా టైపూన్ బీభత్సం.. మూతపడ్డ విమానాశ్రయాలు

Shanghai cancels flights as China braces for Typhoon Bebinca

  • 70 ఏళ్లలో షాంఘైని తాకిన తొలి తుపాన్
  • గంటకు 151 కి.మీ. వేగంతో సిటీని తాకిందని అధికారుల వెల్లడి
  • పార్కులు, పర్యాటక ప్రాంతాల మూసివేత

చైనాను మరో తుపాన్ వణికిస్తోంది. మొన్నటి వరకు హైనాన్ ప్రావిన్స్‌ను యాగి తుపాన్ ఇబ్బంది పెట్టగా.. ఆదివారం నుంచి బెబింకా టైపూన్ బీభత్సం సృష్టిస్తోంది. దాదాపు 70 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా షాంఘై నగరాన్ని ఓ తుపాన్ నేరుగా తాకిందని అధికారులు చెబుతున్నారు. గంటకు 151 కి.మీ. వేగంతో సిటీని తాకిందన్నారు. బెబింకా ప్రభావంతో ఈదురుగాలులు వీస్తుండడం, వర్షం కురుస్తుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. షాంఘైలోని రెండు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసింది. రైళ్లు, బస్సుల రాకపోకలు కూడా నిలిపివేసినట్లు తెలిపింది. టైపూన్ ప్రభావంతో భారీ వర్షం, పెనుగాలులు వీస్తుండడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు పార్కులు, వినోద ప్రదేశాలను అధికారులు క్లోజ్ చేశారు.
 
షాంఘై నగరాన్ని తుపాన్లు నేరుగా తాకడం అత్యంత అరుదని అధికారులు తెలిపారు. చివరిసారి 1949లో టైపూన్ గ్లోరియా తర్వాత మళ్లీ ఇప్పుడు బెబింకా టైపూన్ ఈ సిటీని అల్లకల్లోలం చేస్తోందని వివరించారు. టైపూన్ కారణంగా ఆదివారం రాత్రి నుంచి విమానాశ్రయాలను మూసేశామని, వందలాది విమానాలను రద్దు చేశామని చెప్పారు. ఇటీవలే చైనాలోని హైనాన్ ప్రావిన్స్‌ను యాగి తుపాను ఇబ్బందిపెట్టింది. ఈదురు గాలులు, వర్షాల కారణంగా విద్యుత్ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

  • Loading...

More Telugu News