UPI transactions: యూపీఐ చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్... పరిమితి భారీగా పెంపు

NPCI has increased the limit for UPI transactions to Rs 5 lakh for certain types of payments
  • ఎంపిక చేసిన కొన్ని రకాల చెల్లింపులకు పరిమితి పెంపు
  • రూ.5 లక్షల వరకు పేమెంట్లకు అవకాశం
  • నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన
అవసరం పడినప్పుడు కూడా ఎక్కువ మొత్తంలో యూపీఐ లావాదేవీలు నిర్వహించలేకపోతున్న యూజర్లకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) గుడ్‌న్యూస్ చెప్పింది. ఎంపిక చేసిన కొన్ని రకాల చెల్లింపులకు లావాదేవీల పరిమితిని ఏకంగా రూ.5 లక్షలకు పెంచింది. పెద్ద మొత్తంలో లావాదేవీలు నిర్వహించే యూజర్లకు మరింత సౌలభ్యం కోసం ఎన్‌పీసీఐ ఈ సవరణ చేసింది. 

పన్ను చెల్లింపులు, ఆసుపత్రులు, విద్యా సంస్థలకు చెల్లింపులతో పాటు ఐపీవోలు, ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్‌లలో పెట్టుబడులకు సంబంధించిన లావాదేవీలకు ఈ పరిమితి పెంపు వర్తిస్తుంది. ఇవాళ్టి (సోమవారం) నుంచే ఈ మార్పు అమలులోకి వస్తుందని ఆగస్ట్ 24 నాటి సర్క్యులర్‌లో ఎన్‌పీసీఐ వివరించింది.

కాగా ఇంతకాలం యూపీఐ లావాదేవీల గరిష్ఠ పరిమితి రోజుకు ఒక లక్ష రూపాయలు మాత్రమే ఉండేది. అయితే క్యాపిటల్ మార్కెట్‌లు, ఇన్సూరెన్స్‌లు, విదేశీ చెల్లింపులకు గరిష్ఠ పరిమితి రూ.2 లక్షలుగా ఉంది. కాగా రూ.5 లక్షల వరకు ఎవరైనా చెల్లింపులు చేస్తే ఆ లావాదేవీలను బ్యాంక్‌లు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, యూపీఐ యాప్‌లు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
UPI transactions
NPCI
Business News

More Telugu News