Ritika Singh: రజనీకాంత్ 'వేట్టయాన్' నుంచి రితికా సింగ్ గ్లింప్స్ విడుదల

Ritika Singh glimpse released from Rajinikanth Vettaiyan
  • రజనీకాంత్ ప్రధానపాత్రలో వేట్టయాన్
  • కీలక పాత్ర పోషిస్తున్న రితికా సింగ్
  • టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వస్తున్న వేట్టయాన్
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధానపాత్రలో వస్తున్న తాజా చిత్రం వేట్టయాన్. తెలుగులో వేటగాడు. టీజే జ్ఞానవేల్  దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా రితికా సింగ్ గ్లింప్స్ విడుదల చేశారు. 

ఇందులో రితికా పోషిస్తున్న పాత్ర పేరు రూప. ఆమె ఇందులో ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపిస్తారని గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది. ఆమె శక్తిసామర్థ్యాలు, పోరాడే సత్తాను తెరపైనే చూడాలని చిత్రబృందం క్యాప్షన్ ఇచ్చింది. 

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్బన్ వంటి దిగ్గజం కూడా నటిస్తున్నారు. రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్, మంజు వారియర్, దుషారా విజయన్ తదితరులు నటిస్తున్నారు. 

పోలీస్ డిపార్ట్ మెంట్, న్యాయ వ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కుతున్న వేట్టయాన్ చిత్రం దసరా సీజన్ లో అక్టోబరు 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Ritika Singh
Vettaiyan
Rajinikanth
Jnanavel
Lyca Productions
Kollywood

More Telugu News