Srikanth odela: 'దసరా' సినిమాకు మించి వందరెట్ల ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేస్తాను: దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల

I will create a hundredfold impact beyond Dasara Director Srikanth Odela
  • అనౌన్స్‌మెంట్‌ వీడియో చిత్రీకరణలో శ్రీకాంత్‌ 
  • 'దసరా' తరువాత నానితో మరో సినిమా 
  • కమర్షియల్‌ మీటర్‌లోనే తాజా చిత్రం
'దసరా' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్‌ ఓదెల తొలిచిత్రంతోనే కమర్షియల్‌ దర్శకుల జాబితాలో చేరాడు. దసరా చిత్రంలో నానిని మునుపెన్నడూ చూడని మాస్‌ పాత్రలో చూపించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. దర్శకుడు సుకుమార్‌ దగ్గర శిష్యరికం చేసిన శ్రీకాంత్ ఆయన బాటలోనే దసరా చిత్రాన్ని ఎంతో వైవిధ్యంగా రూపొందించాడు. ఇక నాని-శ్రీకాంత్‌ల సక్సెస్‌ఫుల్‌ కలయికలో మురో చిత్రం రాబోతుంది. 

ఈ చిత్రం కూడా పూర్తి కమర్షియల్‌ పంథాలోనే తెరకెక్కించే పనిలో దర్శకుడు వున్నాడు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రం అనౌన్స్‌మెంట్‌ వీడియోను రూపొందించే పనిలో ప్రస్తుతం వున్నట్టు శ్రీకాంత్‌ తన ఎక్స్‌ అకౌంట్‌ ద్వారా తెలియజేశాడు. ''మార్చి 7, 2023న నా దర్శకత్వంలో వచ్చిన తొలిసినిమాకు ‌చివరిగా 'కట్‌, షాట్‌ ఓకే' చెప్పాను. మళ్లీ సెప్టెంబరు 18, 2024న మళ్లీ షూటింగ్‌లో నా తాజా చిత్రం నాని ఓదెల2 అనౌన్స్‌మెంట్‌ వీడియో కోసం (వర్కింగ్‌ టైటిల్‌)కు యాక్షన్‌ చెబుతున్నాను. నాలుగు కోట్ల ఎనభై నాలుగు లక్షల డెబ్బయ్‌ వేల నాలుగొందల సెకన్లు గడిచిపోయాయి. ఇందులో ప్రతి సెకను నా తదుపరి చిత్రం దిబెస్ట్‌ ఇవ్వడం మీదే దృష్టి పెట్టాను. దసరాకు మించి, దానికి వందరెట్లు నాని ఓదెల2 ద్వారా ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేస్తానని మాట ఇస్తున్నాను' అంటూ రాసుకొచ్చారు. 

ప్రస్తుతం శ్రీకాంత్‌ ఓదెల చేసిన ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా చిత్రీకరణకు ముందే సినిమా ఎలా వుండబోతుందో శ్రీకాంత్‌ ఈ పోస్ట్‌ ద్వారా తెలియజేశాడు. ఈ దసరాకు ముందే ఈ చిత్రం అనౌన్స్‌మెంట్‌ వీడియోను విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. గతంలో దసరా సినిమాకు కూడా పబ్లిసిటీని, ఇలాంటి ప్రమోషన్‌ కంటెంట్‌ను వినూత్నంగా ప్లాన్‌ చేసిన సంగతి తెలిసిందే.
Srikanth odela
NaniOdela2
Nani latest film news
Hero Nani

More Telugu News