AP News: ఏపీలో మందు బాబులకు గుడ్ న్యూస్ ..

Good news to liquor users

  • ఏపీలో అందుబాటులోకి బహుళజాతి సంస్థల మద్యం
  • ప్రస్తుతం విపణిలో మెక్ డోవెల్ విస్కీ నెం.1, ఇంపీరియల్ బ్లూ
  • దేశ వ్యాప్తంగా దొరికే అన్ని రకాల బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్‌‌లో కూడా విక్రయించేలా చర్యలు

నాణ్యమైన మధ్యం అందుబాటులోకి తీసుకువస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు దిశగా చంద్రబాబు సర్కార్ చర్యలు చేపట్టింది. బహుళజాతి సంస్థలకు చెందిన మద్యం బ్రాండ్లు ఇప్పుడు మద్యం షాపులలో దర్శనం ఇస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మద్యం ప్రియులను అనారోగ్యం పాలు చేసే విభిన్న లోకల్ బ్రాండ్లను విక్రయించారని విమర్శలు వచ్చాయి. ఈ నేపధ్యంలో నూతన ఎక్సైజ్ పాలసీ విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు బహుళ జాతి కంపెనీల బ్రాండ్లు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. 

ఈ క్రమంలో మద్యం కొనుగోలుదారుల నుండి విపరీతమైన డిమాండ్ ఉన్న మెక్ డోవెల్ విస్కీ 1, ఇంపీరియలర్ బ్లూ బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్ లో అందుబాటులోకి వచ్చాయి. ఇంపీరియల్ బ్లూ బ్రాండు మధ్యం 60 వేల కేసులు ఇప్పటికే షాపులకు చేరగా, మెక్ డోవెల్ 1 బ్రాండు 10,000 కేసుల క్వార్టర్ సీసాలు రాష్ట్రంలో విక్రయానికి సిద్దంగా ఉన్నాయి. రానున్న పది రోజుల్లో లక్ష కేసులు ఆంధ్రప్రదేశ్ విపణికి చేరనున్నాయని ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 

మరి కొన్ని రోజుల్లో దేశ వ్యాప్తంగా దొరికే అన్ని రకాల బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్ లో కూడా విక్రయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. యాంటిక్విటీ, రాయల్ చాలెంజ్, వాట్ 69, బ్లాక్ డాగ్, ఓడ్కా, జానీ వాకర్ రెడ్ లేబుల్, బ్లాక్ లేబుల్ రకాలు మధ్యం షాపులలో సిద్ధంగా ఉంటాయని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News