Ziva Dhoni: ధోనీ కుమార్తె జివా చదువుతున్న స్కూల్ ప్రత్యేకతలు ఇవే.. ఫీజు ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!
- ధోనీ సొంతూరు రాంచీలోని టౌరియన్ వరల్డ్ స్కూల్లో చదువుతున్న ధోనీ కుమార్తె
- 2008లో స్థాపించిన అమిత్ బజ్లా
- అమిత్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ పూర్వ విద్యార్థి
- 65 ఎకరాల్లో నిర్మాణం
టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ తన కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తాడో అందరికీ తెలుసు. భార్య సాక్షి, కుమార్తె జివాపై ప్రేమానురాగాలు కురిపిస్తూ ఉంటారు. శ్రేయోభిలాషులన్నా అంతే అభిమానం చూపిస్తాడు. సాక్షి, జివా నిత్యం సోషల్ మీడియాలో అభిమానులను పలకరిస్తూ ఉంటారు. 6 ఫిబ్రవరి 2015లో పుట్టిన జివా ప్రస్తుతం రాంచీలో ప్రతిష్ఠాత్మక టౌరియన్ వరల్డ్ స్కూల్లో చదువుకుంటోంది. ఈ స్కూలును అమిత్ బజ్లా 2008లో స్థాపించారు. ఇప్పుడీ ప్రాంతంలో ఇది ప్రముఖ స్కూల్‌గా పేరు సంపాదించుకుంది.
స్కూలు ప్రత్యేకతలు
టౌరియన్ వరల్డ్ స్కూల్ ను మొత్తం 65 ఎకరాల్లో నిర్మించారు. ఇక్కడ విద్యార్థుల కేంద్రంగా విద్యావిధానం ఉంటుంది. అమిత్ బజ్లా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో చదువుకున్నారు. ప్రస్తుతం దీనికి చైర్మన్‌గా ఉన్న ఆయన ముంబైలో ఉంటున్నారు. ఈ స్కూల్లో విద్యతోపాటు విద్యార్థుల వ్యక్తిగత మేధోవికాసంపైనా దృష్టిసారిస్తారు. సంప్రదాయ విద్యను అందించే ఈ స్కూల్లో ఆర్గానిక్ వ్యవసాయం, హార్స్ రైడింగ్, శారీరక, మానసిక శ్రేయస్సు, ఆటలతోపాటు మరెన్నో నేర్పిస్తారు. ఈ స్కూల్లో అంతర్జాతీయ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. అకడమిక్ ఎక్స్‌లెన్స్ మాత్రమే కాకుండా సృజనాత్మక, విమర్శనాత్మక ఆలోచనను, భావోద్వేగ మేధస్సును పెంపొందించేలా పాఠ్యాంశాలు రూపొందించారు.
ఫీజులు ఎలా?
టౌరియన్ వరల్డ్ స్కూల్లో ఫీజులు కూడా గట్టిగానే ఉన్నాయి. ఎల్కేజీ నుంచి 8వ తరగతి వరకు రూ. 4.40 లక్షలు వసూలు చేస్తారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు రూ. 4.80 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజులోనే యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, ఇతర అవసరమైనవన్నీ అందిస్తారు.