Kangana Ranaut: రాహుల్ గాంధీపై కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు

Kangana Ranaut comments on Rahul Gandhi

  • అధికారం కోసం దేశాన్ని విడదీసేందుకు కూడా రాహుల్ వెనుకాడరన్న కంగన
  • 'ఎమర్జెన్సీ' సినిమా విడుదల ఆలస్యం అయ్యే కొద్దీ నష్టాలు ఎదుర్కొంటున్నామని వ్యాఖ్య
  • సినిమాను విడుదల చేయాల్సిన బాధ్యత సెన్సార్ బోర్డుపై ఉందన్న కంగన

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ, సినీనటి కంగనా రనౌత్ మండిపడ్డారు. భారత్ లో కొన్ని మతాలు, భాషలు మిగిలిన వాటికంటే తక్కువనే భావం ఆరెస్సెస్ లో ఉందని అమెరికా పర్యటనలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు మన దేశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. అధికారం కోసం దేశాన్ని విడదీయడానికి కూడా ఆయన వెనుకాడరని అన్నారు. 

తన తాజా చిత్రం 'ఎమర్జెన్సీ' సినిమాకు సెన్సార్ ఇంకా రాకపోవడంపై కంగన స్పందిస్తూ... ఇదొక భారీ బడ్జెట్ మూవీ అని... జీ, మరికొందరు వ్యక్తుల భాగస్వామ్యంతో చిత్రాన్ని నిర్మించానని చెప్పారు. సినిమా విడుదల ఆలస్యం అయ్యే కొద్దీ తాము ఎన్నో నష్టాలను ఎదుర్కొంటున్నామని తెలిపారు. తమ సినిమాను వీలైనంత త్వరగా విడుదల చేయాల్సిన బాధ్యత సెన్సార్ బోర్డుపై ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News