Pawan Kalyan: పవన్ పై ప్రకాశ్ రాజ్ ట్వీట్... మంచు విష్ణు కౌంటర్

Manchu Vishnu counter to Prakash Raj on his remarks on Pawan Kalyan
  • లడ్డూ విషయాన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారన్న ప్రకాశ్ రాజ్
  • తిరుమల లడ్డూ కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక అన్న మంచు విష్ణు
  • పవన్ మాటల్లో మతపరమైన వ్యాఖ్యలు ఎక్కడున్నాయని ప్రశ్న
తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ... ఈ విషయంలో మీరెందుకు అనవసర భయాలను వ్యాపింపజేస్తూ, జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలకు టాలీవుడ్ హీరో, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు. 

"ప్రకాశ్ రాజ్ గారూ, ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. తిరుమల లడ్డూ అనేది కేవలం ప్రసాదం మాత్రమే కాదు. నాలాంటి కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక. పవిత్రమైన ఆచారాలను పరిరక్షించే క్రమంలో ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారు. ఇందులో మతపరమైన వ్యాఖ్యలు ఎక్కడున్నాయి?" అని ట్వీట్ చేశారు. "మీ హద్దుల్లో మీరు ఉండండి" అని హ్యాష్ ట్యాగ్ పెట్టారు.

ప్రకాశ్ రాజ్ ఏమన్నారంటే...
"పవన్ కల్యాణ్... మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారణ జరిపి నేరస్తులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, జాతీయ స్థాయిలో దీనిపై చర్చించుకునేలా చేస్తున్నారు? ఇప్పటికే మన దేశంలో ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు" అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు.
Pawan Kalyan
Janasena
Prakash Raj
Manchu Vishnu
Tollywood

More Telugu News