Nandamuri Mohana Krishna: సీఎం చంద్రబాబును కలిసి విరాళం అందించిన నందమూరి మోహనకృష్ణ, మోహనరూప

Nandamuri Mohana Krishna and Mohana Roopa donates for AP flood vicitims

  • ఇటీవల ఏపీలో వరద విలయం
  • రూ.25 లక్షల విరాళం ప్రకటించిన నందమూరి మోహనకృష్ణ, మోహనరూప
  • నేడు చంద్రబాబును కలిసిన వైనం

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలే భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడం తెలిసిందే. ముఖ్యంగా విజయవాడలోని బుడమేరు పొంగడంతో భారీ నష్టం వాటిలల్లింది. రాష్ట్రంలో 40 మందికి పైగా మృతి చెందారు. 

వరద బాధితులకు ఇప్పటికే ఎందరో సినీ ప్రముఖులు అండగా నిలిచారు. ఈ క్రమంలో నందమూరి మోహనకృష్ణ కూడా స్పందించారు. నందమూరి మోహనకృష్ణ, ఆయన కుమార్తె నందమూరి మోహన రూప తమ వంతు సహాయంగా వరద బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.25 లక్షలు విరాళంగా ప్రకటించారు. 

ఈరోజు వారిద్దరూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును స్వయంగా కలిసి రూ.25 లక్షల రూపాయల చెక్కును అందించారు. గతంలో కూడా నందమూరి మోహనకృష్ణ, నందమూరి మోహన రూప ఇదే విధంగా ఎంతోమందికి సహాయం చేశారు. టీటీడీ అన్నదాన ట్రస్ట్ కు విరాళాలు ఇచ్చారు. 

నందమూరి మోహన రూప గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ తరఫున చాలా చురుకుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

నందమూరి మోహనకృష్ణ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్లో చదివే రోజుల్లో గోల్డ్ మెడలిస్ట్. నందమూరి మోహనకృష్ణ కెమెరామన్ గా ప్రసిద్ధికెక్కారు. తన తండ్రి నందమూరి తారక రామారావు నటించిన బ్రహ్మంగారి చరిత్ర, అనురాగ దేవత, చండశాసనుడు, నందమూరి బాలకృష్ణ గారు నటించిన పలు సినిమాలకు, విక్టరీ వెంకటేష్ గారు నటించిన శ్రీనివాస కళ్యాణం, అదే విధంగా తమిళ్ లో శివాజీ గణేషన్ గారు, ప్రభు గారు నటించిన చరిత్ర నాయగన్, హిందీ లో ఫరూక్ షేక్ గారు నటించిన ఘర్ వాలీ బాహర్ వాలీ సినిమాలకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా, పలు సినిమాలకు  నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ గా వ్యవహరించారు.

గతేడాది గుండెపోటుతో మరణించిన టాలీవుడ్ నటుడు తారకరత్న... నందమూరి మోహనకృష్ణ కుమారుడే.

  • Loading...

More Telugu News