Chiranjeevi: గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన మెగాస్టార్ చిరంజీవి... అదిరిపోయే రికార్డ్
- 1978 సెప్టెంబరు 22న కెరీర్ ప్రారంభించిన చిరంజీవి
- కెరీర్ లో 156 చిత్రాల్లో నటించిన మెగాస్టార్
- 537 పాటల్లో 24 వేల డ్యాన్స్ స్టెప్పులతో గిన్నిస్ బుక్ రికార్డ్
- హైదరాబాదులో గిన్నిస్ బుక్ రికార్డు ప్రదానోత్సవం
కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. చిరంజీవి ఏ అంశంలో గిన్నిస్ బుక్ లోకి ఎక్కారన్నది అత్యంత ఆసక్తి కలిగించే అంశం.
చిరంజీవి తన 45 ఏళ్ల కెరీర్ లో 156 సినిమాల్లో నటించి, 537 పాటల్లో 24,000 డ్యాన్స్ స్టెప్పులు వేశారు. మరే నటుడూ ఇన్ని డ్యాన్స్ స్టెప్పులు వేసిన దాఖలాలు లేవు.
చిరంజీవి 1978 సెప్టెంబరు 22న తన కెరీర్ ప్రారంభించారు. భారతీయ సినీ చరిత్రలో మరే నటుడికి సాధ్యం కాని రీతిలో అత్యధిక స్టెప్పులతో గిన్నిస్ బుక్ రికార్డు నమోదు చేశారు. ఇవాళ హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ప్రతినిధులు హాజరైన చిరంజీవికి రికార్డును అందజేశారు. చిరంజీవి బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ చేతులమీదుగా అందుకోవడం విశేషం.
కాగా, ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ అల్లు అరవింద్, సుస్మిత, వరుణ్ తేజ్, సాయి దుర్గా తేజ్, వైష్ణవ్ తేజ్ తదితరులు హాజరయ్యారు.