Bhanuchandar: భానుచందర్ ఇప్పటికీ యంగ్ గా కనిపించడానికి కారణం ఇదే!

Bhanuchandar health secret

  • 100% ఆకలిగా ఉన్నప్పుడు 60% మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలన్న భానుచందర్   
  • బాగా సంతోషం కలిగినప్పుడు ఓ గ్లాస్ తాగుతానని వెల్లడి 
  • హ్యాపీగా నిద్రలోనే ఎటువంటి ఇబ్బందీ లేకుండా పోవాలన్నది తన కోరికని వ్యాఖ్య   

భానుచందర్ ఒకప్పటి యాక్షన్ హీరో. అప్పట్లో మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చే ప్రతి సినిమాలో ఆయన కోసం ఒక క్యారెక్టర్ ఉండేది. అలాంటి భానుచందర్ ఇప్పటికీ యాక్టివ్ గానే కనిపిస్తారు. ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యమని తరచూ చెబుతూ ఉంటారు. ఎప్పుడూ యంగ్ గా ఉండడానికి మన మనసుతో పాటు శరీరాన్ని కూడా దృఢంగా ఉంచుకోవాలన్నది ఆయన సలహా. అప్పటి నుండి ఇప్పటి వరకు తన ఆరోగ్యం కోసం తీసుకునే జాగ్రత్తలను భానుచందర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

 ఈ వయసులో కూడా మీరు ఇంత ఫిట్ గా ఎలా ఉండగలుగుతున్నారు? అన్న ప్రశ్నకు భానుచందర్ నవ్వుతూ చెబుతూ..  "100% ఆకలిగా ఉన్నప్పుడు మనం 60% మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. మిగిలిన 40% ఖాళీగా ఉంచాలి. ఈ విషయం నేను హీరో నాగేశ్వరావు గారి నుండి నేర్చుకున్నాను. ఉదయం నిద్ర లేవగానే తేనె వాటర్ తాగడం, గ్రీన్ గ్రామ్స్ గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినడం, రోజు ఏదైనా ఒక పండు కచ్చితంగా తినడం చేస్తుంటాను. ఉదయం లేదా నైట్ భోజనంలో బొప్పాయి పండుని కచ్చితంగా తీసుకుంటాను. అందరికీ ఇది ఎలా పడుతుందో నాకు తెలియదు. నా శరీరానికి అయితే బొప్పాయి పండు సెట్ అయింది. రోజూ నా అల్పాహారంలో ఉదయం ఓట్స్ ను తీసుకుంటాను" అని తెలిపారు. 

 మీరు డ్రింక్ చేస్తారా? అనడిగితే.. "నేను తక్కువగా డ్రింక్ చేస్తాను. అలాంటి వాటికి దూరంగా ఉండమని నేను చెప్పను కానీ, అన్నీ లిమిట్ గా తీసుకోవాలి. అది కూడా టైంకి తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని నా అభిప్రాయం. బాగా సంతోషం కలిగినప్పుడు ఓ గ్లాస్ తాగుతాను. అలాగని దానికి ఎడిక్ట్ అవ్వకూడదు. బాధలో ఉన్నప్పుడు డ్రింక్ చేయడం అన్నది చాలా పెద్ద పొరపాటు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటాను. ఇలాంటి ఇంటర్వ్యూల ద్వారా నలుగురినీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది" అన్నారు భానుచందర్. 

జీవితం చాలా చిన్నదని, హ్యాపీగా నిద్రలోనే ఎటువంటి ఇబ్బందీ లేకుండా తన ఫ్రెండ్ ప్రతాప్ చనిపోయినట్లుగా చనిపోవాలనుందనీ, ఎప్పుడూ అదొక్కటే తన కోరికగా ఉంటుందని భానుచందర్ తెలిపారు.

  • Loading...

More Telugu News