Sundeep Kishan: సంక్రాంతికి వస్తున్న సందీప్ కిషన్ 'మజాకా'.. ఫస్ట్ లుక్ విడుదల

Sundeep Kishan first look from Mazaka movie
  • సందీప్ కిషన్, త్రినాథరావు నక్కిన కాంబినేషన్లో 'మజాకా'
  • పెళ్లికొడుకు గెటప్ లో సందీప్ కిషన్ ఫస్ట్ లుక్
  • కీలక పాత్రలు పోషిస్తున్న రావు రమేశ్, అన్షు
యంగ్ హీరో సందీప్ కిషన్, దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రానికి టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాకు 'మజాకా' అనే టైటిల్ పెట్టారు. టైటిల్ ను రివీల్ చేయడంతో పాటు... సందీప్ కిషన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ ఈరోజు విడుల చేశారు. ఫస్ట్ లుక్ లో సందీప్ కిషన్ పెళ్లికొడుకు గెటప్ లో కనిపిస్తున్నాడు. అతని చుట్టూ పెళ్లి హడావుడి కనిపిస్తోంది. 

మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో రావు రమేశ్, 'మన్మథుడు' ఫేమ్ అన్షు కీలక పాత్రలను పోషిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. ఓటీటీ, శాటిలైట్ రైట్స్ రూ. 23 కోట్లకు అమ్ముడుపోయాయి.
Sundeep Kishan
Tollywood
First Look
Mazaka Movie

More Telugu News