Daggubati Purandeswari: పురందేశ్వరికి కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం
- కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్ పర్సన్ గా పురందేశ్వరి
- రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న రాజమండ్రి ఎంపీ
- నేడు లోక్ సభ స్పీకర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ
ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరికి కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్ పర్సన్ గా నియమించింది. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. పురందేశ్వరి ఈ పదవిలో 2026 వరకు కొనసాగనున్నారు. తాజా నియామకం నేపథ్యంలో, పురందేశ్వరికి కేంద్ర మంత్రి పదవి వస్తుందన్న ఊహాగానాలకు తెరపడినట్టయింది. కాగా, పురందేశ్వరి కామన్వెల్త్ పార్లమెంటరీ కమిటీ భారత ప్రాంతీయ ప్రతినిధిగానూ నామినేట్ అయ్యారు.