Ashwini Vaishnav: కుట్రపూరితంగా రైలుకు ప్రమాదం తలపెట్టే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు: అశ్వినీ వైష్ణవ్

Working with state govts and NIA to take action against train sabotage bids
  • ఆయా రాష్ట్రాల యంత్రాంగం, పోలీసులతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడి
  • ఎన్ఐఏ కూడా ఇందులో భాగస్వామ్యమైందన్న కేంద్రమంత్రి
  • ప్రమాదాలకు ప్రయత్నించే వారిని ఉపేక్షించేది లేదన్న వైష్ణవ్
రైల్వే పట్టాలపై కుట్రపూరితంగా ఎల్పీజీ సిలిండర్లు, సైకిళ్లు, ఇనుపరాడ్లు, సిమెంట్ ఇటుకలు పెట్టి రైలుకు ప్రమాదం తలపెట్టే ఘటనల పట్ల రైల్వే శాఖ అప్రమత్తంగా ఉందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు ఆయా రాష్ట్రాల యంత్రాంగం, పోలీసులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా రైలు ప్రమాదాలకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, డీజీపీలు, హోంశాఖ కార్యదర్శులతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఎన్ఐఏ కూడా ఇందులో భాగస్వామ్యమైందన్నారు. ప్రమాదాలకు ప్రయత్నించే వారిని ఉపేక్షించేది లేదన్నారు. ఇలాంటి ఘటనల పట్ల రైల్వే శాఖ కూడా అప్రమత్తంగా ఉందన్నారు. రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు రైల్వే జోన్ల అధికారులతో కలిసి పని చేస్తున్నారని వెల్లడించారు.
Ashwini Vaishnav
Indian Railways
Train Accident
BJP

More Telugu News