Monkeypox Virus: కేరళ యువకుడికి ప్రమాదకర క్లేడ్- 1బీ రకం మంకీపాక్స్.. దేశంలో ఇదే తొలికేసు
- ఇటీవలే యూఏఈ నుంచి వచ్చిన బాధితుడు
- గత వారమే అతడికి మంకీపాక్స్ నిర్దారణ
- తాజాగా స్టెయిన్ రకం గుర్తింపు
- నిలకడగానే బాధితుడి ఆరోగ్యం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఇటీవల కేరళలోని మలప్పురం తిరిగొచ్చిన వ్యక్తిలో ప్రమాదకర మంకీపాక్స్ వైరస్‌లోని క్లేడ్1బీ రకాన్ని గుర్తించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఈ రకం స్టెయిన్‌ను సంబంధించి దేశంలో నమోదైన తొలి కేసు ఇదేనని వైద్యులు తెలిపారు.
38 ఏళ్ల బాధితుడిలో వారం రోజుల క్రితమే వైరస్‌ను నిర్ధారించారు. తాజాగా అతడికి సోకింది క్లేడ్-1బీ రకమని తేలింది. కాగా, ఈ నెల 9న విదేశాల నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ వ్యక్తిలో క్లేడ్-2 రకం వైరస్‌ను గుర్తించారు. ఇది పశ్చిమాఫ్రికాలో వ్యాప్తిలో ఉంది.