Game Changer Movie: 'గేమ్ ఛేంజర్' నుంచి కీలక అప్డేట్.. రెండో సింగిల్ ప్రోమో వచ్చేస్తోంది!

Secong single song is coming from Ramcharan Game Changer movie
  • రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో 'గేమ్ ఛేంజర్'
  • క్రిస్మస్ సందర్భంగా విడుదలవుతున్న భారీ బడ్జెట్ మూవీ
  • ఈ నెల 28న విడుదల కానున్న సెకండ్ సాంగ్ 'రా మచ్చా మచ్చా'
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ మీదున్న అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ చిత్రంలో చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.

‘గేమ్ ఛేంజ‌ర్‌’ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్‌, సినీ ల‌వ‌ర్స్ ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ మూవీ నుంచి మ‌రో క్రేజీ అప్‌డేట్‌ను ఇచ్చేశారు. సెప్టెంబ‌ర్ 28న సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘రా మ‌చ్చా మ‌చ్చా’ ప్రోమో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ తెలియ‌జేశారు. ప‌ల్ల‌విలోని లైన్స్ చూస్తుంటే.. మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ త‌మ‌న్ నుంచి ప‌క్కా మాస్ బీట్ సాంగ్ ఆడియెన్స్‌ను అల‌రించ‌బోతోంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ పాట‌ను ప్ర‌ముఖ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ రాశారు. ఈ చిత్రంలో అంజలి, సముద్రఖని, ఎస్ జే సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, నవీన్ చంద్ర కీలక పాత్రలను పోషించారు.
Game Changer Movie
Ramcharan
Shankar
Second Single Song
Tollywood

More Telugu News