vinesh phogat: వినేశ్ ఫోగాట్... నీ ఆచూకీ ఎక్కడ?.. నోటీసులు జారీ చేసిన 'నాడా'

vinesh phogat gets notice from national anti doping body for apparent failure to comply

  • పారిస్ ఒలింపిక్స్ ఫైనల్స్‌లో బరువు కారణంగా అనర్హత వేటు ఎదుర్కొన్న భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్
  • క్రీడల నుండి రిటైర్‌మెంట్ తీసుకుని కాంగ్రెస్ ద్వారా హర్యానా ఎన్నికల బరిలో నిలిచిన వినేశ్ ఫోగాట్
  • నాడా నోటీసులపై వినేశ్ స్పందిస్తోందా .. లేదా?

పారిస్ ఒలింపిక్స్ ఫైనల్స్‌లో బరువు కారణంగా అనర్హత వేటు పడిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ కు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) బుధవారం నోటీసులు జారీ చేసింది. 14 రోజుల్లో వివరణ ఇవ్వాలని నాడా నోటీసులో పేర్కొంది. వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉండటంతో పారిస్ ఒలింపిక్స్ నుండి వినేశ్ ఫోగాట్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలోనే క్రీడల నుండి రిటైర్మెంట్ కూడా ప్రకటించిన వినేశ్ ఫోగాట్ .. కాంగ్రెస్ పార్టీలో చేరింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో ఉంది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 5వ తేదీన జరగనుంది. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న విడుదల కానున్నాయి. ఈ తరుణంలో వినేశ్ ఫోగాట్ కు నాడా నోటీసులు ఇచ్చింది. 
 
రిజిస్టర్ టెస్టింగ్ పూల్ (ఆర్టీపీ)లో నమోదు చేసుకున్న అథ్లెట్లందరూ డోప్ పరీక్షల కోసం వారి వివరాలు అందించాలి. అవి రాతపూర్వకంగా ఇచ్చాక.. ఆ సమయంలో ఆ ప్రదేశంలో అందుబాటులో వుండాలి. లేకపోతే అది వైఫల్యంగా పరిగణిస్తారు. సోనిపట్‌లోని ఖర్ఖోడా గ్రామంలోని తన నివాసంలో సెప్టెంబర్ 9న డోప్ టెస్ట్ కు ఆమె అందుబాటులో లేకపోవడంతో ఆమె ఆచూకీ వైఫల్యానికి పాల్పడినట్లు నాడా తన నోటీసులో పేర్కొంది. 

  • Loading...

More Telugu News