kalki 2898 ad: ప్రభాస్ కల్కి 2898 ఏడీ చిత్రానికి మరో గుర్తింపు

kalki 2898 ad shines at busan international film festival

  • బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన కల్కి 2898 మూవీ
  • 29వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఎంపిక
  • రూ.1,200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన కల్కి 

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మూవీ 'కల్కి 2898 ఏడీ' బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీకి మరో అరుదైన గుర్తింపు దక్కింది. ఈ మూవీ .. 29వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఎంపికైంది. కల్కి ఓపెన్ సినిమా విభాగంలో ఈ ఫెస్టివల్‌కు ఎంపికైంది. ఈ ఏడాది 29వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అక్టోబర్ 2 నుండి 11 వరకు జరగనుంది. ఇక భారీ అంచనాలతో జూన్ 27న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1,200 కోట్లకు పైగా వసూలు చేసింది. 

  • Loading...

More Telugu News