Prakash Raj: ప్రకాశ్‌ రాజ్‌ను 'మా’ నుంచి బహిష్కరించండి: బీజేపీ

BJP demands MAA to suspend Prakash Raj
  • శ్రీవారి లడ్డూ వ్యవహారంలో ప్రకాశ్ రాజ్ అనుచిత వ్యాఖ్యలు
  • హైదరాబాద్ లో ఆందోళన కార్యక్రమం చేపట్టిన బీజేపీ
  • ప్రకాశ్ రాజ్ దిష్టిబొమ్మ దగ్ధం
కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ చేస్తున్న వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రకాశ్ రాజ్ వ్యవహారశైలిని తప్పుపడుతూ హైదరాబాద్ లో ఈరోజు బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. 

సనాతన ధర్మంపై ప్రకాశ్ రాజ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నుంచి ప్రకాశ్ రాజ్ ను బహిష్కరించాలని వారు కోరారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ప్రకాశ్ రాజ్ వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Prakash Raj
Tollywood
BJP
Tirumala Laddu

More Telugu News