Devara: రేపటి కోసం నా బ్రదర్ తారక్ కు ఆల్ ది బెస్ట్: రామ్ చరణ్

Ram Charan wishes Tarak all the best while releasing Devara tomorrow
  • జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర
  • కొరటాల శివ దర్శకత్వంలో హైఓల్టేజ్ మూవీ
  • రేపు (సెప్టెంబరు 27) వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' చిత్రం రేపు (సెప్టెంబరు 27) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో 'దేవర' చిత్రబృందానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలిపారు. నా సోదరుడు  తారక్ కు, దేవర చిత్రబృందం మొత్తానికి రేపటి కోసం ఆల్ ది బెస్ట్ అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు. 

'దేవర'లో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించడం ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండడం విశేషం. ఈ చిత్రానికి ఎన్టీఆర్ సోదరుడు కల్యాణ్ రామ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన 'దేవర' చిత్రంలోని పాటలకు ఆడియన్స్ నుంచి విశేష స్పందన లభించింది. ఇక, తెలుగు రాష్ట్రాల్లో దేవర సందడి మొదలైంది. ఈ అర్ధరాత్రి నుంచే షోలు వేయనుండడంతో ఫ్యాన్స్ ఉత్సాహంతో ఊగిపోతున్నారు.
Devara
Jr NTR
Ram Charan
Koratala Siva
Tollywood

More Telugu News