Sai Pallavi: సాయిపల్లవి అమరన్‌ వీడియో చూశారా?

Have you seen Sai Pallavi Amarans video

  • సాయి పల్లవి నూతన చిత్రం అమరన్‌
  • ఇందుగా సాయిపల్లవి 
  • అమరన్‌ ప్రమోషనల్‌ వీడియో విడుదల  

కొంత విరామం తరువాత కథానాయిక సాయిపల్లవి తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'అమరన్‌' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. తమిళ నటుడు శివ కార్తికేయన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌. ఈ చిత్రంలో ఆమె ఇందు పాత్రలో కనిపించబోతుంది. 

రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో నటుడు కమల్‌హాసన్‌కు చెందిన రాజ్‌కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్‌ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం సాయిపల్లవి పాత్రను పరిచయం చేసే ఓ వీడియోను విడుదల చేసింది. 

  • Loading...

More Telugu News