IIFA: ఐఫా అవార్డులు: తెలుగులో ఉత్తమ నటుడిగా నాని
- అబుదాబిలో ఘనంగా ఐఫా అవార్డుల కార్యక్రమం
- తెలుగులో ఉత్తమ నటుడిగా నాని
- టాలీవుడ్ లో ఉత్తమ దర్శకుడిగా అనిల్ రావిపూడి (భగవంత్ కేసరి)
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ అవార్డ్స్ (ఐఐఎఫ్ఏ) వేడుక అబుదాబిలో ఘనంగా నిర్వహించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలకు సంబంధించి అవార్డులు ప్రదానం చేశారు.
తాజాగా 24వ ఐఫా అవార్డుల్లో... తెలుగులో నాని నటించిన 'దసరా' ఉత్తమ చిత్రం కేటగిరీలో విజేతగా నిలిచింది. తమిళంలో రజనీకాంత్ 'జైలర్', మలయాళంలో '2018: ఎవ్రీవన్ ఈజ్ ఏ హీరో', కన్నడలో దర్శన్ నటించిన 'కాటేరా' ఉత్తమ చిత్రాలుగా నిలిచాయి.
ఉత్తమ నటుడు కేటగిరీలో నాని (దసరా), విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్-2), టొవినో థామస్ (2018: ఎవ్రీవన్ ఈజ్ ఏ హీరో), రక్షిత్ శెట్టి (సప్త సాగరదచ్చే ఎల్లో) అవార్డులు అందుకున్నారు.
ఉత్తమ నటి కేటగిరీలో ఐశ్వర్యరాయ్ (పొన్నియిన్ సెల్వన్-2), మృణాల్ ఠాకూర్ (హాయ్ నాన్న), అనస్వర రాజన్ (నేరు), రుక్మిణి వసంత్ (సప్త సాగరదచ్చే ఎల్లో) అవార్డులు అందుకున్నారు.
ఉత్తమ దర్శకుల కేటగిరీలో మణిరత్నం (పొన్నియిన్ సెల్వన్-2), అనిల్ రావిపూడి (భగవంత్ కేసరి), జియో బేబీ (కాదల్: ద కోర్), తరుణ్ కిశోర్ సుధీర్ (కాటేరా) అవార్డులు అందుకున్నారు.