Raa Macha Macha: రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ నుంచి ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ ప్రోమో రిలీజ్
- రామ్ చరణ్, శంకర్ కాంబోలో గేమ్ చేంజర్
- ఈ నెల 30న విడుదల కానున్న రా మచ్చా మచ్చా సాంగ్
- ఆకట్టుకునేలా ఉన్న సాంగ్ ప్రోమో
- 1000 మంది కళాకారులతో రామ్ చరణ్ డ్యాన్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వాని హీరోయిన్. ఈ ఏడాది క్రిస్మస్ సీజన్ లో ఈ సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.
తాజాగా గేమ్ చేంజర్ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ‘రా మచ్చా మచ్చా..’ ప్రోమోను మేకర్స్ నేడు విడుదల చేశారు. తెలుగు, తమిళంలో పాటు ‘ రా మచ్చా మచ్చా..’ అంటూ సాగే ఈ పాట హిందీలో ‘ ధమ్ తు దికాజా...’ అంటూ అలరించనుంది. రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్‌గా తెరకెక్కిన ఈ పాట లిరికల్ వీడియో సెప్టెంబర్ 30న పాట రిలీజ్ అవుతుంది.
నేడు ఈ సాంగ్ ప్రోమో యూట్యూబ్ లో విడుదలైన కాసేపట్లోనే వ్యూస్ పోటెత్తాయి. తమన్ బాణీలకు అనంతశ్రీరామ్ సాహిత్యం అందించారు. నకాష్ అజీజ్ ఆలపించారు.
కాగా, ఈ పాటలో ఏకంగా 1000కి పైగా జానపద కళాకారులతో కలిసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డాన్స్ చేయటం విశేషం. అది కూడా భిన్నత్వానికి ఏకత్వమైన మన దేశంలోని ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులను ఇందులో భాగం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సంస్కృతులను బేస్ చేసుకుని రా మచ్చా మచ్చా పాటను శంకర్ వినూత్నంగా తెరకెక్కించారు.
ఏపీలో గుసాడి, కొమ్ము కోయ, తప్పెట గుళ్లు వంటి జానపద నృత్యాలతో పాటు వెస్ట్ బెంగాల్‌కు చెందిన చౌ, ఒరిస్సాకు చెందిను గుమ్రా, రానప్ప, పైకా, దురువ వంటి వాటితో పాటు కర్ణాటకు చెందిన హలారి, ఒక్కలిగ, గొరవర, కుణిత వంటి నృత్య రీతులను కూడా భాగం చేశారు. ఈ పాటకు బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య నృత్య రీతులు సమకూర్చారు.