SIT: శ్రీవారి లడ్డూ కల్తీపై దర్యాప్తు కోసం తిరుపతి చేరుకున్న సిట్ బృందం
- గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి నేతృత్వంలో సిట్ ఏర్పాటు
- నేడు తిరుపతి చేరుకున్న సిట్
- తిరుపతిలోని పోలీస్ గెస్ట్ హౌస్ లో టీటీడీ అధికారులతో సమావేశం
తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణల నేపథ్యంలో, నిగ్గు తేల్చేందుకు ఏపీ ప్రభుత్వం సిట్ ను నియమించిన సంగతి తెలిసిందే. గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి నేతృత్వంలోని సిట్ బృందం నేడు తిరుపతి చేరుకుంది.
తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్ లో సిట్, టీటీడీ అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశం దాదాపు రెండున్నర గంటల పాటు సాగింది.
కాగా, లడ్డూ కల్తీపై దర్యాప్తు చేసేందుకు సిట్ బృందం మూడ్రోజుల పాటు తిరుపతిలోనే ఉండనుంది. కల్తీ నెయ్యి వాడకం వెనుక ఎవరున్నారన్న కోణంలో సిట్ దర్యాప్తు సాగనుంది. తిరుపతి వచ్చిన సిట్ బృందంలో ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠితో పాటు తిరుపతి ఏఎస్పీ వెంకట్రావు, ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు ఉన్నారు.