Nursing Student: ఏకాంతంగా గడిపేందుకు హోటల్ కు వెళ్లిన యువ జంట.. తీవ్ర రక్తస్రావంతో యువతి మృతి

Girl bleeds to death as BF surfs net for hours looking for a remedy
  • అంబులెన్స్ కు ఫోన్ చేయకుండా సొంత వైద్యం కోసం ప్రయత్నించిన ప్రియుడు.. గుజరాత్ లో ఘటన
  • వైద్యం అందితే బతికేదంటున్న వైద్యులు
  • ప్రియుడిపై కేసు పెట్టి అరెస్టు చేసిన పోలీసులు
ఏకాంతంగా గడిపేందుకు ప్రియుడితో హోటల్ కు వెళ్లిన ఓ యువతికి రక్తస్రావం జరిగింది. ఓవైపు ఆ యువతి బాధపడుతుంటే ప్రియుడు అంబులెన్స్ కు ఫోన్ చేయకుండా సొంత వైద్యం చేసేందుకు ప్రయత్నించాడు. గంటల తరబడి ఇంటర్ నెట్ లో వెతికాడు. దీంతో సమయానికి వైద్యం అందక ఆ యువతి చనిపోయింది. రక్తస్రావం జరుగుతుంటే వెంటనే ఆసుపత్రికి తీసుకెళితే యువతి బతికేదని వైద్యులు తెలిపారు. యువతి మరణానికి ఆమె ప్రియుడే కారణమని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. గుజరాత్ లోని నవసారిలో జరిగిందీ ఘటన.

నవసారి జిల్లాకు చెందిన ఓ నర్సింగ్ విద్యార్థినికి మూడేళ్ల కిందట ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. పరిచయం పెరిగి ఇరువురూ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పలు కారణాలతో ఇద్దరూ దూరమయ్యారు. రెండేళ్ల తర్వాత ఇటీవల కలుసుకున్నారు. ఈ క్రమంలోనే గత నెలాఖరులో ఇద్దరూ నవసారిలోని ఓ హోటల్ కు వెళ్లారు. అక్కడ సన్నిహితంగా గడిపే క్రమంలో యువతికి రక్తస్రావం జరిగింది. రక్తం ఆపేందుకు ఆమె ప్రియుడు వివిధ ప్రయత్నాలు చేశాడు.

స్నేహితులకు ఫోన్ చేసి కనుక్కోవడం, నెట్ లో వెతకడం చేశాడు. ఈలోగా యువతి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే, అప్పటికే రక్తస్రావం కారణంగా యువతి చనిపోయిందని వైద్యులు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు. యువతి ప్రైవేట్ పార్టులలో గాయాలయ్యాయని, దీంతో తీవ్ర రక్తస్రావం ఏర్పడి షాక్ తో యువతి చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్టు వెల్లడించింది.
Nursing Student
Hotel Room
Blood
Lover
Gujarat

More Telugu News