Prakash Raj: కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ!: ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్

Prakash Raj another tweet sparks social media debate
  • ఇటీవల వెలుగులోకి వచ్చిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం
  • పవన్ ను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు
  • తాజాగా చేసిన ట్వీట్ తో మరోసారి ఆసక్తి రేకెత్తించిన వైనం 
ఇటీవల తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం తెరపైకి వచ్చాక, నటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో తరచుగా పోస్టులు పెడుతున్నారు. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి చేసిన కొన్ని ట్వీట్లు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

తాజాగా ప్రకాశ్ రాజ్ ఎక్స్ లో చేసిన ఓ ట్వీట్ కూడా నెటిజన్లలో ఆసక్తి రేకెత్తిస్తోంది. "కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ... కదా!... ఇక చాలు... ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి..." అంటూ పేర్కొన్నారు. తన ట్రేడ్ మార్క్ హ్యాష్ ట్యాగ్ 'జస్ట్ ఆస్కింగ్' ను కూడా జోడించారు.
Prakash Raj
Tirumala Laddu Row
Pawan Kalyan
Andhra Pradesh

More Telugu News