Ravichandran Ashwin: వీరిద్దరి దగ్గర టాలెంట్ ఉంది: అశ్విన్

ashwin picks future batting pillars of indian cricket

  • యువ ఆటగాళ్లు శుఖ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఆట తీరును ప్రశంసించిన అశ్విన్
  • మరో రెండు మూడేళ్లలో రిటైర్ కానున్న సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 
  • టీమ్ ఇండియా బ్యాటింగ్ విభాగంలో భవిష్యత్తులో మూల స్తంభాలుగా నిలుస్తారని అభిప్రాయపడ్డ అశ్విన్

భారత క్రికెట్ టీమ్‌లో బ్యాటింగ్ విభాగానికి మూలస్తంభాలుగా ఉన్న సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరో రెండుమూడేళ్లలో రిటైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో వీరిద్దరి స్థానాలను ఎవరు భర్తీ చేస్తారన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించిన తర్వాత సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 

యువ ఆటగాళ్లు శుఖ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌లను ప్రశంసిస్తూ వారిద్దరూ భవిష్యత్‌లో టీమిండియా బ్యాటింగ్ విభాగంకు మూల స్తంభాలుగా నిలుస్తారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 
యశస్వి జైస్వాల్‌లో స్పెషల్ టాలెంట్ ఉందని అన్నాడు. అతడు స్వేచ్ఛగా, తనకు నచ్చిన శైలిలో ఆడతాడని పేర్కొన్నాడు. శుఖ్‌మన్ గిల్ లోనూ మంచి టాలెంట్ ఉందన్నాడు. వీరు మరిన్ని సవాళ్లను ఎదుర్కొని కొత్త అనుభవాలను సంపాదించాలని, దేని మీద పని చేయాలో వారే స్వయంగా గుర్తించగలగాలన్నాడు. 
 
కాగా, ఓపెనర్ గా బరిలో దిగుతున్న యశస్వి జైస్వాల్ ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ ఏడాది స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన అయిదు టెస్టుల సిరీస్‌లో జైస్వాల్ 9 ఇన్నింగ్స్‌లో 712 రన్స్ చేసి సత్తాచాటాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. శుఖ్‌మన్ గిల్ కూడా తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ టీమ్‌లో కీలక ఆటగాడుగా ఎదుగుతున్నాడు. 

  • Loading...

More Telugu News