Konda Surekha: కేటీఆర్, నాగార్జున, నాగచైతన్యపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు.. సురేఖ వ్యాఖ్యలను ఖండించిన నాగార్జున

Nagarjuna and Naga Chaitanya pressured Samantha to go to KTR says Konda Surekha

  • కేటీఆర్, నాగార్జునలపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
  • ఎన్ కన్వెన్షన్ కు, సమంతకు, కేటీఆర్ కు ముడిపెడుతూ సురేఖ ఆరోపణలు
  • దాంతో సమంత కాపురం విచ్ఛిన్నమైందని వెల్లడి
  • సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమన్న నాగార్జున
  • వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ ట్వీట్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనీ నటుడు నాగార్జున, ఆయన కుమారుడు యంగ్ హీరో నాగచైతన్యపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చకుండా ఆపడానికి, కేటీఆర్ ఓ 'షరతు' విధించారని, దాంతో ఆ 'షరతు'ను అంగీకరించాలంటూ సమంతను ఆమె భర్త నాగచైతన్య, నాగార్జున ఒత్తిడి చేశారని తెలిపారు. అయితే, దీనికి సమంత ఒప్పుకోలేదని సురేఖ చెప్పారు.

ఒప్పుకోకపోతే తమ ఇంటి నుంచి వెళ్లిపోవాలని సమంతకు నాగార్జున స్పష్టం చేశారని... ఈ కారణంతోనే, ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత నాగచైతన్యతో సమంత విడిపోయిందని చెప్పారు. 

మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను కూడా కేటీఆర్ టార్చర్ పెట్టారని... కేటీఆర్ వల్లే రకుల్ తక్కువ సమయంలోనే ఇక్కడి నుంచి వెళ్లిపోయి, హడావుడిగా పెళ్లి చేసుకుందని అన్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. టాలీవుడ్ ను షాక్ కు గురి చేస్తున్నాయి.

మరోవైపు, కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను నాగార్జున ఖండించారు. ఎక్స్ వేదికగా నాగార్జున స్పందిస్తూ..."గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను... మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను" అని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News