Subrahmanyam Jaishankar: అక్టోబర్ 15, 16న పాకిస్థాన్‌లో కేంద్రమంత్రి జైశంకర్ పర్యటన

S Jaishankar to visit Pakistan for annual Shanghai Summit on October 15 and 16
  • ఇస్లామాబాద్ వేదికగా వార్షిక షాంఘై సహకార సంఘం సమావేశం
  • ఎస్సీవో సదస్సుకు ఆతిథ్యమిస్తున్న పాక్
  • ఈ సమావేశానికి హాజరుకానున్న జైశంకర్
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ రెండ్రోజుల పాటు పాకిస్థాన్ లో పర్యటించనున్నారు. అక్టోబర్ 15, 16 తేదీల్లో ఆయన పాకిస్థాన్‌లో పర్యటించనున్నారు. ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న షాంఘై సహకార సంఘం (ఎస్సీవో) వార్షిక సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ వెల్లడించారు.

ఎస్సీవో సదస్సుకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. పాక్ నుంచి ఆహ్వానం అందినట్లు ఆగస్ట్ 30న కేంద్రం ధృవీకరించింది. ఈ శిఖరాగ్ర సమావేశంలో ఎస్సీవో సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులు ఆయా దేశాల మధ్య ఆర్థిక, సామాజిక-సంస్కృతిక, మానవతా సహకారంపై చర్చించనున్నారు.
Subrahmanyam Jaishankar
India
Pakistan

More Telugu News