Charminar: చార్మినార్‌పై ప్రమాదకరంగా నడిచిన వ్యక్తి... నెట్టింట వీడియో వైర‌ల్‌!

Man Walks On Charminar Video goes Viral on Social Media

  • చార్మినార్ చివ‌రి అంత‌స్తులో నిల‌బ‌డి.. వ్య‌క్తి  ప్ర‌మాద‌క‌ర‌ స్టంట్ 
  • ఒక కిటికీ నుంచి మ‌రో కిటికీని ప‌ట్టుకొని ప్ర‌మాద‌క‌రంగా న‌డిచిన వైనం
  • కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసులు

హైద‌రాబాద్ అంటే మ‌న‌కు మొద‌ట గుర్తొచ్చే చారిత్రాత్మ‌క క‌ట్ట‌డం చార్మినార్‌. ఆ చార్మినార్‌పై ఎక్కిన‌ ఓ వ్య‌క్తి తాజాగా సాహ‌స‌పూరిత చ‌ర్య‌కు పాల్ప‌డ్డాడు. చార్మినార్ చివ‌రి అంత‌స్తులో నిల‌బ‌డి.. ప్ర‌మాద‌క‌ర‌మైన స్టంట్ చేశాడు. 

ఒక కిటికీ నుంచి మ‌రో కిటికీని ప‌ట్టుకొని డేంజ‌ర‌స్‌గా న‌డిచాడు. అతడు అలా సాహ‌సం చేయ‌డాన్ని ఎవరో వీడియో తీసి నెట్టింట పెట్టారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్ అయింది.

ఇక వీడియో చూసిన నెటిజ‌న్లు ఆ వ్య‌క్తి ఇలా ప్రమాదకరంగా న‌డ‌వ‌డంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అసలు ఆ వ్యక్తి ఎవ‌రు? చివ‌రి అంత‌స్తు వ‌ర‌కు వెళ్లేందుకు ఎవ‌రు అనుమ‌తి ఇచ్చారు? అలా ప్రమాదకరంగా నడవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలా రకరకాల ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. 

కాగా, ఈ ఘటన స్థానిక పోలీసుల దృష్టికి వెళ్ల‌డంతో వారు స్పందించారు. చార్మినార్ వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఆ నిర్మాణ పనులు చేస్తున్న కార్మికుల్లో అత‌డు ఒకరై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News