Srinuvaitla: కన్‌ఫ్యూజన్‌లో తీసుకున్న డిప్రెస్ డెసిషన్ ఆ సినిమా: దర్శకుడు శ్రీను వైట్ల
- నా సినిమాల నేపథ్యం విషయంలో రియలైజ్ అయ్యాను అంటూ శ్రీను వైట్ల కామెంట్స్
- విశ్వం ఆడియన్స్‌ను సంతృప్తిపరుస్తుందని ధీమా
- నా కంటెంట్‌ను, శైలిని ఇష్టపడుతున్నారు అని వెల్లడి
వినోదాత్మకమైన కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ దర్శకుడు శ్రీను వైట్ల. ఢీ, రెడీ, దూకుడు వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ఆయన ఈ మధ్య రేసులో కాస్త వెనుకబడ్డాడు. చాలా కాలం విరామం తరువాత శ్రీను వైట్ల డైరెక్షన్‌లో రాబోతున్న చిత్రం 'విశ్వం'. గోపీచంద్, కావ్యథాపర్ జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శ్రీను వైట్ల పాత్రికేయులతో మాట్లాడారు.
''కేవలం తెలుగు ఆడియన్స్ కోసమే చేసిన సినిమా ఇది. ప్రస్తుతం దేశంలో వున్న ఓ బర్నింగ్ ఇష్యూను తీసుకుని దానికి ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ యాక్షన్, ఎమోషన్‌ను జోడించి ఈ చిత్రాన్ని రూపొందించాను. ఈ చిత్రంలో అన్ని అంశాలు చాలా ఫ్రెష్‌గా వుంటాయి. గోపీచంద్ పాత్రను డిజైన్ చేసిన విధానం, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా అన్నీ తాజాగా ఉంటాయి. ఎంటర్‌టైన్‌మెంట్ కూడా చాలా సిచ్యుయేషనల్‌గా వుంటుంది. విశ్వంలో ఎన్ని రహస్యాలు దాగి వుంటాయో, చిత్రంలోని విశ్వ పాత్రలో అన్ని ఎమోపన్స్, షేడ్స్ ఉంటాయి.
విశ్వం అనే పాత్ర, అతని ప్రయాణం, అతనికి ఎదురైన పరిణామాలు? టార్గెట్‌ను రీచ్ అయ్యే విధానం ఆసక్తికరంగా వుంటుంది. ఈ సినిమాలో కామెడీ కూడా సిచ్యుయేషన్ పరంగా వుంటుంది. ఆడియన్స్ ఎలాంటి అంశాలు ఇష్టపడుతున్నారో తెలుసుకుని దానికి నా స్టయిల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను జోడించి ఈ చిత్రాన్ని రూపొందించాను. ఏదో సినిమా తీయాలి అని తీసిన సినిమా కాదు ఇది. నా సినిమా నేపథ్యాలు అన్ని ఒకేలా ఉంటున్నాయని రియలైజ్ అయ్యి, ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని దానికి నా శైలి వినోదాన్ని జోడించి చేసిన సినిమా ఇది" అని వివరించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ... 'అమర్ అక్బర్ ఆంటోని' అనే సినిమా డిప్రెస్ థాట్‌లో ఉన్నప్పుడు కన్‌ఫ్యూజన్‌లో తీసుకున్న డెసిషన్ అది. ఆ సినిమా వల్ల నిర్మాతలు ఏమీ నష్టపోలేదు కానీ ఆడియన్స్‌కు నచ్చలేదు' అని చెప్పారు. ఇప్పటికీ ఆడియన్స్ నా కంటెంట్‌ను, నా శైలిని ఇష్టపడుతున్నారు. విశ్వం సినిమా వాళ్లను పూర్తిగా సంతృప్తిపరుస్తుంది" అని కూడా ఆయన తెలిపారు.