Sachin Tendulkar: ఆ విషయం చాలామందికి తెలియదు: సచిన్

sachin tendulkar recalls baroda connection from early days in cricket
  • బ్యాంక్ ఆఫ్ బరోడా గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన సచిన్
  • అండర్ – 15 టోర్నమెంట్ లో మహారాష్ట్ర తరుపున ఆడి, 123 పరుగులు చేశానని చెప్పిన సచిన్
  • బరోడాతో తనకు ఉన్న అనుబంధాన్ని వివరించిన సచిన్
తాను ముంబై తరపున ఆడి మొదటి సెంచరీ బరోడాలో చేశానని, ఈ విషయం చాలా మందికి తెలియదని, 1986లో అండర్ – 15 టోర్నమెంట్ లో మహారాష్ట్ర తరపున పాల్గొని 123 పరుగులు చేశానని భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తెలిపారు. బ్యాంక్ ఆఫ్ బరోడా గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన సందర్భంగా ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో సచిన్ తన తొలి ఇన్నింగ్స్, బరోడాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 

అండర్ – 15 టోర్నమెంట్‌లో మహారాష్ట్ర తరుపున ఆడిన తర్వాత ముంబై రంజీ జట్టుకు ఎంపికైనట్లు తెలిపారు. అప్పుడు ప్రాబబుల్స్‌లో ఉన్నా తుది జట్టులో చోటు దక్కలేదన్నారు. కానీ యాదృచ్ఛికంగా ఆ మ్యాచ్ కూడా బరోడాలోనే జరిగిందన్నారు. ఆ సమయంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఫౌండర్ సయాజీ రావు గైక్వాడ్ 3 ప్యాలెస్‌ను సందర్శించే అవకాశం తనకు లభించిందన్నారు. బరోడా మాజీ ప్లేయర్ సమర్ జిత్ గైక్వాడ్‌తో కలిసి అడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. బరోడాతో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. తన 400వ వన్డే మ్యాచ్ కూడా బరోడాలోనే ఆడానని సచిన్ చెప్పారు. 
Sachin Tendulkar
Bank Of Baroda
Mumbai

More Telugu News