Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- అంతర్జాతీయ సానుకూలతలతో దూసుకెళ్లిన మార్కెట్లు
- గత ఆరు సెషన్ల వరుస నష్టాలకు బ్రేక్
- 584 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూలతలు, చైనా ఉద్దీపన చర్యల వంటి పరిణామాలతో మార్కెట్లు ఈరోజు లాభాలను చవిచూశాయి. గత ఆరు సెషన్లుగా నష్టాలను మూటకట్టుకున్న మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 584 పాయింట్లు లాభపడి 81,634కి చేరుకుంది. నిఫ్టీ 217 పాయింట్లు పెరిగి 25,013 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అదానీ పోర్ట్స్ (4.76%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.42%), రిలయన్స్ (2.01%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.95%), ఎల్ అండ్ టీ (1.83%).
టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-2.89%), టైటాన్ (-2.59%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.27%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-1.98%), బజాజ్ ఫైనాన్స్ (-1.12%).