Ration Cards: రేషన్ కార్డులపై వైఎస్సార్, జగన్ ఫొటోలతో పాటు వైసీపీ రంగులను తొలగిస్తున్న ఏపీ ప్రభుత్వం

AP govt removing YSRCP colours on ration cards
  • కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి సిద్ధమవుతున్న ఏపీ ప్రభుత్వం
  • ఏపీ ప్రభుత్వ అధికార చిహ్నంతో రానున్న కార్డులు
  • ప్రభుత్వ ఆమోదం కోసం డిజైన్లను పంపిన అధికారులు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫొటోలను ముద్రించిన సంగతి తెలిసిందే. అంతేకాదు పార్టీ రంగులతో రేషన్ కార్డులను నింపేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ కార్డులను తొలగించాలని నిర్ణయించింది. వాటి స్థానంలో కొత్త కార్డులు ఇవ్వడానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అడుగులు వేస్తోంది. 

కొత్త కార్డులకు సంబంధించి అధికారులు పలు డిజైన్లను పరిశీలిస్తున్నారు. లేత పసుపు రంగులో ఉండే కార్డుపై రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నాన్ని ముద్రించిన డిజైన్ ను ప్రభుత్వ ఆమోదం కోసం అధికారులు పంపించారు. దీంతోపాటు మరికొన్ని నమూనాలను కూడా పంపినట్టు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్నా పాత కార్డులపైనే రేషన్ సరుకులను ఇస్తున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Ration Cards
Andhra Pradesh

More Telugu News