Nobel Peace Prize: జపాన్ సంస్థకు నోబెల్ శాంతి పురస్కారం
ది నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రకటన
నిహాన్ హిడాంక్యోను వరించిన నోబెల్ శాంతి బహుమతి
అణ్వాయుధాలు లేని ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్న సంస్థ
జపాన్ సంస్థ నిహాన్ హిడాంక్యోను ప్రఖ్యాత నోబెల్ పురస్కారం వరించింది. 2024 సంవత్సరానికి గాను ఈ సంస్థకు నోబెల్ శాంతి పురస్కారాన్ని నోబెల్ కమిటీ ప్రకటించింది. అణ్వాయుధాలు లేని ప్రపంచాన్ని సృష్టించేందుకు గాను ఈ సంస్థ చేస్తున్న ప్రయత్నానికి గాను నోబెల్ శాంతి బహుమతి లభించింది.
ది నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈ పీస్ ప్రైజ్ ను నిహాన్ హిడాంక్యో సంస్థకు ప్రకటించింది. హిరోషిమా, నాగసాకి అణుబాంబు ఘటనలో ప్రాణాలతో బయటపడిన వారి నుంచి ఈ అణుబాంబురహిత ఉద్యమం ప్రారంభమైంది. అణుబాంబు దాడుల నుంచి ప్రాణాలతో బయటపడిన వారికి ఈ సంస్థ సేవలు అందిస్తోంది.