Stock Market: ఈ వారాన్ని నష్టాలతో ముగించిన స్టాక్ మార్కెట్లు
- అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూలతలు
- 230 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 34 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, ఫైనాన్షియల్ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 230 పాయింట్లు కోల్పోయి 81,381కి పడిపోయింది. నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయి 24,964 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.63%), టెక్ మహీంద్రా (1.57%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (1.02%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.96%), ఇన్ఫోసిస్ (0.83%).
టాప్ లూజర్స్:
టీసీఎస్ (-1.84%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.83%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.64%), మారుతి (-1.30%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.30%).