Chiranjeevi: కర్ణాటక ఎమ్మెల్యే రక్తదానం... తన నివాసంలో అభినందించిన చిరంజీవి

Chiranjeevi appreciated Karnataka MLA Pradeep
  •  హైదరాబాద్ వచ్చిన కర్ణాటక ఎమ్మెల్యే
  • చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదానం
  • అనంతరం చిరంజీవి నివాసానికి వెళ్లిన వైనం
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ ఇవాళ చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశారు. ప్రదీప్ ఈశ్వర్ చిక్ బళ్ళాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇవాళ ప్రదీప్ ఈశ్వర్ హైదరాబాదులో మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.

చిరంజీవితో భేటీకి ముందు ప్రదీప్ చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశారు. ఆయన బంధువు రమేశ్ బాబు కూడా రక్తదానం చేశారు. అనంతరం చిరంజీవి నివాసానికి విచ్చేశారు. కర్ణాటక ఎమ్మెల్యేకి చిరంజీవి సాదర స్వాగతం పలికారు. రక్తదానం చేసినందుకు ప్రత్యేకంగా అభినందించారు.
Chiranjeevi
Pradeep
Blood Donation
MLA
Congress
Karnataka

More Telugu News